స్నేహ మణిపూసలు
రచన:- మేడికాయల స్నేహ
9వ తరగతి, ZPHS,
గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా.
గురువు:- శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు,
గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా.
వివిధ మణిపూసలు
1
మా తోటలో చెట్టుంది
పూలు పండ్లను ఇస్తుంది
నీడ గాలిని అందించి
ఆరోగ్యంగ ఉంచింది
2
వానకాలం వచ్చింది
రైతు పండుగ తెచ్చింది
పంటలు బాగ పండించి
లాభాలన్ని ఇచ్చింది
3
మా చెల్లి పేరు బుజ్జి
ఆమెకు ఇష్టం బజ్జి
హోటలుకు వెళ్లి తింటె
ఆమెకులేచెను గజ్జి
4
మా మామయ్య వచ్చాడు
మామిడి పండ్లు తెచ్చాడు
అందరం తిన్నందుకు
డబ్బులు ఇచ్చి పోయాడు
5
బడికే నేను వచ్చాను
తైదంబలి తాగాను
వేడి దూరమవ్వగ
జ్ఞానముతో చదివాను
6
ఉగాది పండుగ వచ్చెను
పులుపు,వగరు,కారములను
తీపి, ఉప్పు,చేదును
అన్ని కలిపియు తిన్నాను
7
అనగనగా ఒక చెల్లె
ఆమెకు ఇష్టము మల్లె
తోటకెల్లి పూలు తెచ్చి
పూలతో మాల అల్లె
8
దుకాణానికి వెళ్ళాను
కొత్త పొత్తము కొన్నాను
కలము బట్టి కథలు రాయ
గురువులందరు మెచ్చేను
9
పచ్చ పచ్చని చెట్లు
ప్రగతికవియే మెట్లు
కాలుష్యం పారద్రోల
చెట్ల కేయను కాట్లు
10
పొలముకుమేము పోయాము
అంత మడిలో దిగినాము
నాట్లు చక్కగ వేశాక
రాత్రికి మింటికొచ్చాము
వివిధ మణిపూసలు
11
మా అమ్మ పేరు రేణుక
లేదు ఆమెకును తీరిక
పని ఎప్పుడు చేస్తుంటది
తీరదేనాడు కోరిక
12
మా ఇంట్లోని తమ్ముడు
వాడు చాల మంచోడు
వానికి ఉంది సైకిలు
రోజు తొక్కు తుంటాడు
13
వేసవి కాలము వచ్చెను
మండె ఎండలను తెచ్చెను
ఎండలు బాగ ముదిరాక
ఉష్ణోగ్రతలే హెచ్చెను
14
ఆకాశం రంగు నీలి
కాలుష్యం పారద్రోలి
ఓజోను పొర కాపాడి
ప్రజలనూ రక్షించాలి
15
నాన్న ఇసుకను తెచ్చాడు
వాకిట్లనే పోశాడు
మేస్త్రీ లను పిల్చుకొచ్చి
పనులను మొదలు పెట్టాడు
వివిధ మణిపూసలు
16
బోరును మేమువేశాము
మోటరందున దించాము
నీరు పైకి వచ్చాక
పంటలను పండించాము
17
కొమురవెళ్లి పోయాము
మల్లన్నను చూసాము
కొబ్బరికాయ కొట్టాక
లడ్డూలను కొన్నాము
18
అడవిలోకి పోయాము
సింహాన్ని చూసాము
అది అరుపులుఅరువంగ
మేము చాలవణికాము
19
ఎక్కాలన్ని నేర్చాను
లెక్కల సార్ కు చెప్పాను
క్లాసులో వినిపించంగ
గురువుగారు ననుమెచ్చెను
20
నాన్న అటోను కొన్నాడు
ఇంటికి దాన్ని తెచ్చాడు
గుడిలో పూజ చేయించి
కిరాయి లెన్నొ కొట్టాడు
21
అమ్మ బీడీల్ చేసింది
కంపెనీలకు పోయింది
మాపు రోజు ఇవ్వగ
బట్వాడెంతొ వచ్చింది
22
నాన్నమ్మ ఫోన్ చేసింది
ఎట్లున్నవని అడిగింది
బాగున్నాను అన్నాక
ఇంటికినన్ను రమ్మంది
23
మకర సంక్రాంతి వచ్చెను
సంబురాలనే తెచ్చెను
పొద్దున్నే లేచియు
వాకిట్లో ముగ్గు వేశాను
24
పేడతొ సాన్పు చల్లాను
చక్కని ముగ్గు పెట్టాను
దానిలో రంగులద్దగ
ఎంతో అందంగుండెను
25
ఆవు పేడను తెచ్చాను
గొబ్బెమ్మలను చేశాను
గుమ్మము లోన పెట్టి
నవధాన్యాలు వేశాను
*వివిధ మణిపూసలు*
26
పని పూర్తిగా అయ్యింది
పూల దండలుగుచ్చింది
పూజ మొదలు పెట్టియు
దీపమును ముట్టించినది
27
అమ్మ వంటలు చేసింది
అందరికి వడ్డించింది
కలిసి మేము తిన్నాక
కథల నెన్నో చెప్పింది
28
వేకువజాము లేచాము
వెన్నెల నేమొ పోయింది
రవి కిరణాలు వచ్చాయి
కనుమ నైతే వచ్చింది
29
పొయ్యిని వెలిగించింది
పాలను పొంగించింది
హరిదాసులొచ్చారు
బిక్ష నేమొవేసింది
30
వెన్నెల రానే వచ్చింది
రాత్రి కానే అయ్యింది
చుక్కలెన్నో పొడిచాయి
మంచు ఎంతో కురిసింది
31
ప్లాస్టికును ఆపేద్దాము
అవనిని కాపాడుదాము
భూమిలో నీరు చేరగ
రైతుకు సేవ చేద్దాము
32
మేడారము పోయాము
గుండంలో దిగినాము
స్నానాలు చేశాక
దర్శనానికి వెళ్ళాము
33
షాపింగు మాల్ వెళ్ళాము
బట్టలెన్నోకొన్నాము
డబ్బులన్నియు ఇచ్చాక
బస్టాండుకు పోయినాము
34
బస్సును ఎక్కినాము
ఇంటికి వచ్చినాము
నాన్నకు చూపించాను
టైలరుకు ఇచ్చాము
35
మంచి మంచి డిజైను
మాకు కుట్టి ఇచ్చెను
వేసుకొని మురిసిపోయి
సంతోష పడ్డాను
36
మా ఇంటి కాడ చెలక
దానిలో చిన్న మొలక
తీసుక వచ్చి పెట్టాక
దానిని మెసెను మేక
37
వర్ష మైతే వస్తుంది
వరద నేమొ పోతున్నది
ఉరుములే ఉరుమంగ
మెరుపేమౌ మెరుస్తుంది.
*వివిధ మణిపూసలు*
38
స్నేహితులంత కలిశాము
విహార యాత్ర పోయాము
చూడదగిన ప్రదేశాలు
తనివి తీరగ చూశాము
39
మా ఇంట్లో ఉంది పిల్లి
చేస్తుంది భాగా లొల్లి
రోజు పాలు తాగేసి
తిరుగుతుంది గల్లి గల్లి
40
పక్క ఇంటిలో ముసలి
ఆమె పెద్దగయ్యాలి
దానము కూడ చెయ్యది
తినని కైతె కావాలి
41
మాకు ఉంది ఒక కూలర్
దానికి కావాలె పవర్
చల్లని గాలి తగలగ
వచ్చెనులె నాకు ఫీవర్
42
మా వీధిలో లైటు
రోజు వస్తది నైటు
వెలుగును అందించగా
మాకు తెలిసే రూటు
43
మా తాత వచ్చాడు
పాలెన్నోతెచ్చాడు
తోడేసి పెరుగు చేసి
అందరికీ పంచాడు
44
నాన్న కొన్నాడు కారు
వెళ్ళారులే షికారు
అన్ని తిరిగి చూడగ
ఆనందం పొందారు
45
తోటకు మేము వెళ్ళాము
పండ్లెన్నో తెంపాము
తిరిగి ఇంటికి వచ్చియు
పక్కింటోళ్ళకిచ్చాము
*వివిధ మణిపూసలు*
46
చెల్లె యాత్రకు పోయింది
పుణ్యక్షేత్రము చూసింది
దర్శనము చేసుకుని
తిరిగి ఇంటికి వచ్చింది
47
అమ్మ ఊరికి వెళ్ళింది
నన్నొదిలేసి పోయింది
నేను బాగా ఏడ్చాను
జ్వరము బాగా వచ్చింది
48
మూలకాలనునేర్చాను
ప్రార్థనలోన చెప్పాను
గురువు నన్నుమెచ్చంగ
బహుమతులెన్నొ పొందాను
49
బస్సులొ మేము ఎక్కాము
సీట్లలో కూర్చున్నాము
కండక్టరు వచ్చాక
టికెట్లు తీసుకున్నాము
50
బంతి పువ్వు పూసింది
అందంగా విచ్చింది
దేవునికి అమ్మ పెట్ట
అక్క చూసి ఏడ్చింది.
51
ఆకాశమేమొనీలము
దాని కిందనే మేఘము
చల్లగాలి దాకగా
కురిసే నెంతో వర్షము
52
దీపావళి వచ్చింది
పటాకులను తెచ్చింది
వాటిని నేను కాల్చగా
చేయి నాకు కాలింది
53
మా ఊరిలో ఒక చెరువు
ఎన్నడు రాలేదు కరువు
అందునీరు లేకుంటే
రైతుకేమొ గుండె దరువు
54
తూర్పు కొండల్ల సూర్యుడు
కనిపించే మరో దేవుడు
వేడిమిని అందించి
లోకబాంధవుడైనాడు
55
చెరువుకుఅన్న వెళ్లాడు
చేపలెన్నో పట్టాడు
ఇంటికి తిరిగి తెచ్చి
సంతకు వెళ్లి అమ్మాడు
*వివిధ మణిపూసలు*
56
రేగుపండ్లకు వెళ్లాను
నాకు ముళ్ళు గుచ్చుకొనెను
ఇంటికి తిరిగి వచ్చాక
ముళ్ళు రాకనె ఏడ్చాను
57
ఉల్లి నారును పోశాము
నీరును పారించినాము
గడ్డ చాలా ఊరాక
రైతు బజార్ల అమ్మినము
58
జామకాయలు తెంపాము
ఇంట్ల అందరి కిచ్చాము
బావున్నాయి అనగానె
మళ్ళీ కొన్ని ఇచ్చాము
59
చీపురు నేను కొన్నాను
దాంతో ఇల్లు ఊడ్చాను
అంత శుభ్రము కాగానె
చెత్తను బయట వేశాను
60
నాకు జ్వరమే వచ్చింది
డాక్టర్ నమ్మ పిలిచింది
ఆమె సూది ఇవ్వగనే
జ్వరమే మాయమయ్యింది
61
బాయికాడ మిరప తోట
ఇంటికాడ సద్దిమూట
అమ్మ ఇంకా రాలేదు
ఆకలేమొ అవుతుందట
62
ఆధార్ కార్డు ఇచ్చాము
తక్కెడ తీసుకొచ్చాము
దాంట్లోబీడీల్ జోకి
అన్నింటిని అమ్మినాము
63
పెన్సిల్ చేత పట్టాను
పేపర్ పైన రాశాను
ఇంటి పని అంతజేసి
గురువుకు చూపించినాను
చిత్రాలకు మణిపూసలు
64
మాకు లేదు ఏ పండుగ
మా బతుకె పెద్ద దండగ
పొట్ట కూటి తిప్ప లొచ్చె
ఎట్ల బతుకుడు మీలాగ
65
నెలవంక వచ్చి నప్పుడు
చీకటేమొ అయి నప్పుడు
అందరికి ఉండేఅండ
మనకున్న నీడే తోడు.
*వివేకానందుని మణిపూసలు*
66
చెప్పేది నరేన్ గురించె
కలకత్తలో జన్మించె
వీధిన నడుస్తుండగ
పెద్ద శబ్దం వినిపించె
67
గుర్రపు బండి ఎక్కిండు
బలమునుపయోగించిండు
ప్రాణాలకు తెగించియు
మహిళనే కాపాడిండు
68
జనవరిలో జన్మదినం
ఇదే జాతికి యువజనం
తండ్రి విశ్వనాధ దత్త
అందరి మార్గదర్శనం
69
నరేనుకు భాగవతము
రామాయణ భారతము
శ్రీరాముడి కథలంటె
ఆ బాబునకు ప్రాణము
70
ఈయన తెలివితేటలు
ఎప్పటికి చిరునవ్వులు
చిందించేటి ముఖమే
ఆయనకు భూషణాలు
71
ఆటలంటే ప్రాణము
అన్నిట్ల పాల్గొనడము
అందరితో పోటీపడి
ప్రతిసారికిగెలవడము
72
వేగంగ పరిగెత్తడం
కొత్తాట కనిపెట్టడం
బట్టలు చింపుకొనియు
దెబ్బలు తాకిందనడం
73
తల్లెంతో బాధ పడిన
తండ్రెంతో గాబరైన
ఆటలన్ని మానకుండ
చదువులోనె ముందాయన
74
రామకృష్ణులు గురువులు
గొప్ప తెలిసినవారలు
వివేకానందులకు
చేసెనుగ హితబోధలు
75
చికాగో నగరమునందు
స్వామీజీ వెళ్లెముందు
భారతీయ ధర్మాన్ని
లోకానికి చెప్పెను అందు
*వివిధ మణిపూసలు*
76
కవులార కదలండి
ఆలస్యము అవునండి
మణిపూసలను రాసి
అవార్డులు పొందండి
77.
క్యాలెండరునుకొన్నాను
రాసులు తేది చూశాను
దేవుని బొమ్మను చూసి
నోటుబుక్కుల దించాను
78
నాన్న సంతకు వెళ్ళాడు
ఆవు తీసుకువచ్చాడు
మేత దానికి వేసి
చెంబుల పాలు పిండాడు.
79
పాలకేంద్రం పోయాడు
పాలు మొత్తం పోశాడు
డబ్బులు తీసుకొచ్చి
అవసరాలను తీర్చాడు
80.
బడికి మేము వచ్చాము
పూసలు రాస్తున్నాము
తెలుగు సారునుకలిసి
సందేహాలడిగాము.
*బాల సాహిత్య కార్యశాల*
81
కార్యశాలకు వెళ్లాను
గేయం మరియు కవితలను
కథలన్నీ రాసుకొని
గురువులకు చూపించాను
82
సారు రైటు వేశారు
పేపరులను ఇచ్చారు
అందంగా రాయమని
అందరితో చెప్పారు
83
రాత మొదలుపెట్టాము
కథలు పూర్తి చేశాము
గురువులకుచూపించి
తినడానికి వెళ్ళాము
84
చేతులనే కడిగాము
ప్లేటులనే పట్టాము
వరుసలోన నిలబడి
అన్నమేసుకొన్నాము
85
కూర వేసుకొన్నాము
వరుసగ కూర్చున్నాము
అందరము తిన్నాక
సేదతీర్చుకున్నాము
86
తిరిగి తరగతి కొచ్చాము
అందరము కూర్చున్నాము
పెద్దలు మాట్లాడినంక
వేదికపైకి పోయాము
87
సర్టిఫికెటును ఇచ్చారు
అందరు తీసుకున్నారు
ఫోటోలు దిగినంక
సభనైతే ముగించారు
88
సమయము అయిపోయింది
ఆటోనే వచ్చింది
అందరము ఎక్కాక
ఇంటికాడ దించింది
89
ఇంటికి నేను చేరాను
సర్టిఫికెటునుతీసాను
నాన్నమ్మకు చూపిస్తె
చాలా సంతోషించెను
90
వేకువనే లేస్తాను
మణిపూసలు రాస్తాను
సెల్లులో పోటో తీసి
గురువుకే పంపుతాను.
*వివిధ మణిపూసలు*
91
బడికి మేము వెళ్ళాము
సరస్వతికి మొక్కాము
చదువు బాగ రావాలని
టెంకాయలను కొట్టాము
92
పంతులు గారు వచ్చారు
పంచాంగమును తీశారు
పంటలు బాగ పండాక
దక్షన ఇవ్వ మన్నారు
93
రక్షబంధన్ వచ్చింది
అనుబంధాలు తెచ్చింది
రాఖీ కట్టడానికి
అక్క ఇంటికి వచ్చింది
94
అక్క రాఖీ తెచ్చింది
తమ్ము చేతికి కట్టింది
స్వీటు నోట్లో పెట్టి
ఆశీర్వాదమిచ్చింది.
95
నేనప్పుడే వచ్చాను
నాకు కావాలన్నాను
నేను కూడరాఖి కట్టి
అభినందనలు తెల్పాను
96
డిజిటలు క్లాసు వెళ్ళాను
తెలుగు పాఠము విన్నాను
పాఠ అర్థము చేసుకొని
జవాబు లన్ని రాశాను
97
సారు పాఠములుచెప్పెను
సందేహాలను తీర్చెను
మంచి చదువుచదువుకొని
రాతను మార్చుకోమనెను.
98
రోడ్డు మీద పిల్లి ఉంది
దానికి ఒక తల్లి ఉంది
తల్లి పిల్లి వేటకెళ్ళి
ఎలుక పిల్లను తెచ్చింది.
కరోనా మణిపూసలు
99
చైనాలో పుట్టింది
కరోనాగ వెలిసింది
దేశాలన్ని పాకింది
ప్రాణాలను తీస్తుంది
100
ఆశలు చిది మేస్తున్నది
శ్వాస నంతము చేస్తుంది
తుమ్ము దగ్గుద్వారా
కరోనా వస్తున్నది
101
దూరంగ ఉండండి
మాస్కులు ధరించండి
కఠిన చర్యలు చేపట్టి
కరోనా తరమండి
ఉట్టి మణిపూసలు
102
పెరుగు బుడ్డి తీశాము
గిన్నెలోmyనె పోశాము
కవ్వంతోనే చిలికి
వెన్న నైతె చేశాము
103
అమ్మ పాలను కాచింది
తోడు దాంట్లో వేసింది
ఉట్టిమీదనే పెట్టి
పొలం కాడికి పోయింది
104
తిరిగి ఇంటికి వచ్చాము
కుర్చివేసిఎక్కాము
మూతనుమేముతీసాక
పెరుగు దాంట్లో చూశాము
105
నాన్న తాడును తెచ్చాడు
వరుసలు పట్టిఅల్లాడు
ఉట్టిని తయారుజేసి
దూలానికి ముడివేశాడు
106
మా ఇంటిలో పిల్లుంది
రోజు పెరుగును తాగింది
విసుగు బాగా వచ్చి
అమ్మ పిల్లిని కొట్టింది
రచన:-
మేడికాయల స్నేహ
9వ తరగతి, ZPHS,
గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా.
గురువు:-
శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు,
గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా.




Comments
Post a Comment